Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు Telugu Christian Song Lyrics

యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు Lyrics


యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2)

నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే (2)
తన ఆజ్ఞలలో జీవించుటకై
కృపతో నింపి కాపాడుము (2)        ||యెహోవా||

నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను (2)        ||యెహోవా||

నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను (2)
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును (2)        ||యెహోవా||

Your favourites

  • No Favourites found!