Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నీ కోపము చేత గద్దింపకుము Telugu Christian Song Lyrics

యెహోవా నీ కోపము చేత గద్దింపకుము Lyrics

1. యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ
నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము
2. నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ
నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది
3. నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ
పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు
4. నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ
నాపై మోయలేని బరువు - వలె నున్నవి
5. మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ
కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు
6. నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ
నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను
7. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ
నా పాపమును గూర్చి విచారపడుచున్నాను
8. నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ
నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు
9. మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ
మేలు చేసినందుకు వారు - విరోధులైరి
10. దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ
రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము


Your favourites

  • No Favourites found!