Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నీ మహిమ స్తవము యేసుని Telugu Christian Song Lyrics

యెహోవా నీ మహిమ స్తవము యేసుని Lyrics

యెహోవా నీ మహిమ స్తవము యేసుని సుందర మందిరము ఇది
యెంతో నిత్య శుభకరము సాహసమున క్రై స్తవాళి తోడను స్నేహ
మమర నీ శిష్యులు నిపు డీ గేహమునకు భ క్తిని జేరిరి నీ బాహు
బలముఁ గ న్పపడ దీవించుము ||యెహోవా||

1. ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు
దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ
కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ
నికేతనంబులు ||యెహోవా||

2. పరమండలంములం దుండి నీ కరుణఁ జల్లి యీ యాలయము పైని
సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ
మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల
నిమ్మని నెరి బ్రార్థింతుము ||యెహోవా||

3. అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ
మందిరములు గా ముందొనరించుచుఁ బొందుగ నలు దెస లందు
నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతిఁ బొందుట
కిందురాను నీ వింక నొనర్పుము ||యెహోవా||

4. పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున
నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును
సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతోఁ దన క్షత రక్త
మహౌ షధ మిడి ప్రోవను ||యెహోవా||

5. ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలోఁ జేరియుండు దాని
కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా
కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది
సౌఖ్యమొందుదము ||యెహోవా||

Your favourites

  • No Favourites found!