Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నీ నామము - ఎంతో బలమైనది Telugu Christian Song Lyrics

యెహోవా నీ నామము - ఎంతో బలమైనది Lyrics

పల్లవి:   యెహోవా నీ నామము - ఎంతో బలమైనది  ...ఆ...ఆ...ఆ...

యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||


1.   మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి

యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి   || యెహోవా ||


2.   నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా 

అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి  || యెహోవా ||


3.   సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి 

ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము  || యెహోవా ||


4.   చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా 

సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను   || యెహోవా ||

Your favourites

  • No Favourites found!