యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది యెంతో మధురం
దైవం నీవయ్యా – పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపూ
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపూ
మరణాథ యేసు నాధ నీదు రాజ్యములో నన్ను చేర్చు
ఘనుడా సిల్వధరుడా అమూల్యం నీదు రుధిరం (2)
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా||
ప్రియుడా ప్రాణ ప్రియుడా – వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయధనమాయే
ఓ మృత్యుంజయుడా నీకె స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం ||యెహోవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవా నీదు మేలులను ఎలా Lyrics
Your favourites
- No Favourites found!
