యెహోవాకు స్తుతులు పాడండి - మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు
1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి - మీరు
2. తంబురతోను సితారాతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది - మీరు
3. భక్తులు ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఉప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు - మీరు
4. అన్యజనులను శిక్షించుటకు
రాజులఁ గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనతయునిదే - మీరు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవాకు స్తుతులు పాడండి మీరు సమాజములో Lyrics
Your favourites
- No Favourites found!
