Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవానైన నేను మార్పు లేని వాడను Telugu Christian Song Lyrics

యెహోవానైన నేను మార్పు లేని వాడను Lyrics

యెహోవానైన నేను మార్పు లేని వాడను గాన
యాకోబు సంతతివారగు మీరు లయము కాలేదు (2)
1. దేవుడెహోవ మనుష్యుడు కాడు - మాట మీరని వాడు
పశ్చాత్తాప పడడే మాత్రం - అబద్ధమాడ నేరడు
2. నా దాసుడైన దావీదు నిమిత్తము - నాదు నిమిత్తమును
ఈ పట్టణమును కాపాడి రక్షింతు - వేరుతన్ని వారెదుగుదురు
3. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక
ఆపత్కాలమందున నీకు ఉత్తరము నిచ్చును గాక
4. సైన్యము లధిపతి ప్రత్యక్షమై - తన ప్రజలను రక్షింప
కిరీటమందలి రత్నములవలె - సురక్షితముగ నుండెదరు
5. గాలివానకు ఆశ్రయమై - పగటి ఎండకు నీడై
పర్ణశాల నొకటి యుండగ - సురక్షితముగ నుండెదరు
6. మహిమ యంతటి పైన తనదు - వితాన మేఘము నిలచు
సీయోను నందలి ప్రతి స్థలమందు ప్రభావ మహిమ ప్రజ్వలించు
7. లెమ్ము నీవు ఓ సీయోను - ధరియించు నీదు బలమును
లోనికి రాడు అన్యుడెవడును - హృదయ సున్నతి లేనివాడు


Your favourites

  • No Favourites found!