Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాను గానము చేసెదము యేకముగా మనకు Telugu Christian Song Lyrics

యెహోవాను గానము చేసెదము యేకముగా మనకు Lyrics

యెహోవాను గానము చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము
ఆయనను అర్ణించెదము - ఆయనే దేవుడు మనకు
1. యుద్ధశూరుడేహోవా - నా బలము నా గానము
నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవాను
2. ఫరోరథముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను
ఎర్ర సముద్రములోన - ముంచివేసె నెహోవా
3. నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు - నేపై లేచువారిని
4. దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెను
5. వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహానీయుడా
అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు?
6. ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి


Your favourites

  • No Favourites found!