Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును Telugu Christian Song Lyrics

యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును Lyrics


యెహోవాను సన్నుతించెదన్
ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్
ఆ నామమునే గొప్ప చేసెదన్ (2)
హల్లెలూయా హల్లెలూయా (2)         ||యెహోవాను||

నాకున్న సర్వము నన్ను విడచినను
నావారే నన్ను విడచి నిందలేసినను (2)
నా యేసయ్యను చేరగా
నేనున్నానన్నాడుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2)         ||యెహోవాను||

నాకున్న భయములే నన్ను కృంగదీయాగా
నా హృదయం నాలోనే నలిగిపోయేగా (2)
నా యేసయ్యను చేరగా
నన్నాదరించెనుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2)         ||యెహోవాను||

నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా
నాపైన చీకటియే నాన్నవరించెగా (2)
నా దీపము ఆరుచుండగా
నా యేసయ్య వెలిగించెగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2)         ||యెహోవాను||

Your favourites

  • No Favourites found!