Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు శత్రుని Telugu Christian Song Lyrics

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు శత్రుని Lyrics

యెహోవాను స్తుతించుడి - ఆయన దయాళుడు
శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే
1. యోసేపును విడిపించిన కర్త - ఎల్ల - మోసములోనుండి కాచున్
ప్రియముతోడ పాశముతోడ - నాశము లేకుండ బ్రోచిన దేవుడే
2. షిమ్యోనును గాచిన ప్రభువు - ప్రతి - నిమిషము మనలను కాచున్
కూడెద మిపుడే స్తోత్రముతోడ - పాడెద మిచ్చట కూడిన మనము
3. మనష్షేను కరుణించి - వాని పాపములను మన్నించెన్
రాజాధిరాజు తప్పడు మాట - ఎన్నటెన్నటికి మనతో నుండును
4. యెహోయాకీను తలనెత్తి మరణాజ్ఞనుండి మన్నించి
చెరవస్త్రములను మార్చిన తండ్రి డాగులేని వస్త్రముల మనకిచ్చెను
5. యిర్మియాను పైకెత్తి - చెఱ ముట్టడినుండి కాపాడి
విడుదలనిచ్చి యింటికి నడిపి - కష్టములబాపి ప్రేమ చూపించెను
6. పేతురును కాచినదూత - అనేకులకాచిన ప్రభువు
ప్రార్థనలెల్ల వెంటనే వినుచు - సంఘపు మొఱలను విని విడిపించెను
7. పౌలును సీలను కాచి - సంఘ చింతల నెల్లను తీర్చి
విడుదల నిచ్చున్ తిమోతియుకు - కడు భక్తితో పాడెదముగా హల్లెలూయ


Your favourites

  • No Favourites found!