యెహోవాను స్తుతించుడి - మీరు - యెహోవా నామమును స్తుతియించుడి
అను యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి
1. యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్
నేటి దినమున వినెడి మీరు - ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు
2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువని
నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు - భూమ్యాకాశములందున లేడని
3. ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు
సొలొమోను నందా వాగ్దానములను - కన్నుల విందుగ నెరవేర్చెనుగా
4. పోవుడి, పోవుడి - తొలగిపోవుడి - అపవిత్రమైన దేని ముట్టకుడి
యెహోవా సేవోప కరణములను - మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి
5. ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గాన
ఉన్నతమైన స్థానమందుండి - ఘనుడైనవాడై హెచ్చింపబడును
6. పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారై
సీయోను! నీ దేవుడేలు చున్నాడని - స మాధానమును ప్రకటించు పాదములు
7. ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొర్రెపిల్ల సింహాసనముండు
సేవింతురు తన దాసులాయనను - రవి తేజులై దివి రాజ్యమునందు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును Lyrics
Your favourites
- No Favourites found!
