Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ Telugu Christian Song Lyrics

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ Lyrics

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా
నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది
1. ఉదయము నందు నీదు కృపను
ప్రతిరాత్రిలో నీ - విశ్వాస్యతను
యెహోవా నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది
2. పదితంతులు గల - స్వరమండలమున్
గంభీర ధ్వనిగల - సితారలను
వాయించి నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది
3. ఎందుకనగా యెహోవా - నీ కార్యము చేత
నీవు నన్ను సంతోష-పరచు చున్నావు
నీ చేతిపనులను బట్టి - నేనుత్సహించుచున్నాను
4. యెహోవా నీ కార్యము - లెంత మంచివి
నీ యాలోచన లతి - గంభీరములు
పశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు
5. నిత్యనాశనము - నొందుటకే గదా
భక్తిహీనులు గడ్డి - వలె చిగుర్చుదురు
చెడు కార్యములను - చేయువారు పుష్పింతురు
6. మహోన్నతుడవుగా - నిత్యముండు యెహోవా
నీ శత్రువు లెహోవా - నశియించెదరు
చెడు పనులను చేయు - వారందరు - చెడిపోదురు
7. నీతిమంతులు తమా-ల వృక్షమువలె
నాటబడినవారై - యెహోవా మందిరములో
ఎదుగుచు మొవ్వు వేసి - వర్థిల్లుచు నుండెదరు
8. నాకు ఆశ్రయమైన - యెహోవా యథార్థుడు
చెడుగు లేనివాడని - ప్రసిద్ధి చేయుటకు
సారము కలిగి ప-చ్చగ నుందురు వృద్ధులు


Your favourites

  • No Favourites found!