Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు మేలుతో Telugu Christian Song Lyrics

యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు మేలుతో Lyrics

యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు
మేలుతో నీహృదయమును - తృప్తిపరచుచున్నాడు
1. దేవా నీదు కృపతో - నన్ను కరుణింపుము
నీ వాత్సల్యతతో నా - గత పతనంబుల క్షమియించు
2. ఆకాశమున నుండి కలిగిన - దర్శనమునకు
నే నవిధేయుడను కాను - నా దేవా జూపుము కృపను
3. బాధించు శత్రువు నన్ను - బలముగ బాధించినను
నే ధైర్యము విడువను - నను బలపరచుము నీలోన
4. ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండెద నిలలో
పావనమగు నీ యాత్మన్ - ప్రాపుగ నొసగుము నీదయతో
5. ప్రభుయేసు నామమిలలో - ప్రాకటముగ నే బ్రకటింతు
ప్రత్యక్షముగ నీ శక్తిన్ - ప్రసాదించుము నాకిలలో
6. నీయందు నేను నిలిచి - నిత్యము నే ఫలియింతున్
సత్యాత్ముడా నాకిమ్ము - నిత్యముగను నీ జీవం
7. ఆత్మాగ్ని చేత దేవా - అజ్ఞానుండగు నను నింపు
నీ జ్ఞానము నాకిమ్ము - సుజ్ఞానుండా హల్లెలూయా


Your favourites

  • No Favourites found!