1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు
యెహోవా అందరికిని మహోపకారుండు
ఆయన కనికరమాయన పనులపై నున్నది
2. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు
నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక
3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు
నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు
4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు
నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును
5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును
కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును
6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు
7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి
ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడుదీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడుయెహోవా Lyrics
Your favourites
- No Favourites found!
