యెహోవాయే మనదేవుడు - మార్పులేనివాడు (2)
నిన్న నేడు నిరంతరము - ఒకే రీతిగా ఉన్నాడు (2)
1. పాపశాపముల బాప - మానవ రూపి ఆయెను
అద్భుత ప్రేమ జూపి - మనలను తానె రక్షించెను
2. తన రెక్కలతో కప్పి - ఆశ్రయమిచ్చును ఆయనె
స్వరక్త మిచ్చి కొన్న - తన సంఘమును కాయును
3. క్రుంగిన వేళలందు - అభయమునిచ్చె దేవుడు
తన హస్తముతో నిలిపి - అంతమువరకు ఆదుకొనున్
4. శాశ్వత ప్రేమ జూపి - శ్రమలలో విజయ మిచ్చును
విశ్వమంతయు మారిన - ఎన్నడుమారడు మనయేసు
5. సంఘముగా చేరి - యెహోవాకే మొర్ర పెట్టెదము
ఆపత్కాలము నందు - ఉత్తరమిచ్చును ఆయనె
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవాయే మనదేవుడు మార్పులేనివాడు నిన్న నేడు Lyrics
Your favourites
- No Favourites found!
