Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్ Telugu Christian Song Lyrics

యెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్ Lyrics

యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్
తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదము
1. మనమాయన జనము - ఆయన సంతతియు
సిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చె
ఎంత అద్భుత రక్షకుడు
2. అడుగువాటికంటె - అధికముగ నిచ్చె
తన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చె
మాట తప్పనివాడవు
3. కష్టదుఃఖములందు - పాలివాడాయె
ప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపైమోపె
మనతో నుండును నిరతము
4. ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమి
అయినను ప్రభువే తన దయజూపి
మనలన్ క్షమియించెనుగా - ప్రేమగల మా తండ్రివి
5. నీవే మా దుర్గమును - కేడెము నీవే
నిన్నుమేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవే
మేము నీదు ప్రజలము


Your favourites

  • No Favourites found!