Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును Telugu Christian Song Lyrics

యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును Lyrics


యెహోవాయే నా కాపరిగా
నాకేమి కొదువగును (2)

పచ్చికగల చోట్లలో
నన్నాయనే పరుండజేయును (2)
శాంతికరమైన జలములలో (2)
నన్నాయనే నడిపించును (2)          ||యెహోవాయే||

గాఢాంధకార లోయలలో
నడిచినా నేను భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)
నా తోడైయుండి నడిపించును (2)          ||యెహోవాయే||

నా శత్రువుల ఎదుట నీవు
నా భోజనము సిద్ధపరచి (2)
నా తల నూనెతో నంటియుంటివి (2)
నా గిన్నె నిండి పొర్లుచున్నది (2)          ||యెహోవాయే||

నా బ్రతుకు దినములన్నియును
కృపాక్షేమాలు వెంట వచ్చును (2)
నీ మందిరములో నే చిరకాలము (2)
నివాసము చేయ నాశింతును (2)          ||యెహోవాయే||

Your favourites

  • No Favourites found!