Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి Telugu Christian Song Lyrics

యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి Lyrics

యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు
సహదాసులతో మహి నొకఁడనని సహాయ మిడుటే నీవంతు ||యెహోవా||

1. మితిమిఱిన దు రిత సమూహముల క్షత మొనర్ప మన నావంతు
పతితపావనుని క్షతజనములో నను నుతికి కడుగుటె నీవంతు ||యెహోవా||

2. ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచు నిను స్తుతి యొనర్చుటే నావంతు
క్షితినేఁబడుదు ర్వెతల నుండ శా శ్వతముఁ బ్రోచుటె నీవంతు ||యెహోవా||

3. చంచల మతిఁదొల గించుమంచుఁ బ్రా ర్థించుచుండుటే నావంతు
అంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతను బెంచుచుండుటే నీవంతు ||యెహోవా||

4. యేసు సిలువలో నే సంధించి గాసి సహించుట నావంతు భాసురమోక్ష
ని వాసమునకు నను దీసుకపోవుటే నీవంతు ||యెహోవా||

5. మేటి వార్త నా బోటి జనాళికి ఁ జాటించుటయే నావంతు చాటిన
దానిని గాటముగ మది నాటించుటయే నీవంతు ||యెహోవా||

6. అనుదిన మబలుఁడ నని మదినిం గనుఁ గొని బ్రదుకుటయే నా
వంతు ననుఁ బదాబ్జప జ్జనుఁ జేర్చియు బల మును గృప నిచ్చుటే
నీవంతు ||యెహోవా||

7. ముదముతోడ నీ తుదిరాక కొఱకు నెదురు చూచుటే నావంతు
సదమలాత్మచే హృదయమును సదా పదిలపఱచునటే నీవంతు ||యెహోవా||

Your favourites

  • No Favourites found!