Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసంటే ఎవ్వరో తెలిసికో యేసు మార్గమందు నీవు Telugu Christian Song Lyrics

యేసంటే ఎవ్వరో తెలిసికో యేసు మార్గమందు నీవు Lyrics

యేసంటే ఎవ్వరో తెలిసికో
యేసు మార్గమందు నీవు నడచుకో
నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు
నింగినేలకు సర్వం నిలచియున్న దేవుడు

1. సర్వజనులారా ఆలకించుడి
సత్యమైన దేవుని గమనించుడి
సామాన్యులేమి సామంతులేమి
ధనికులు ధరిద్రులు లోక నివాసులెవరైన

2. మొంది నాము మనమెందుకో
జగతిపై నివసించె దెందుకో
ఏమిజరుగుతుందో ఇంకేమి జరగనుందో
మర్కాలను వివరించె మహత్ముడు మన దేవుడు

3. స్థిరమైనది కాదుర మన దేహము
చిరకాలముండదు మన భోగము
పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా
వట్టిమాట కాదురా గట్టిది దేవుని రక్షణ

4. ఆకాశం చేసినది దేవుడే
భూమిని సృష్టించినది దేవుడే
సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు
అగ్నివాయువు జలములు అన్ని మనకిచ్చినాడు

5. ప్రేమంటే ఏమిటో తెలిసికో
జీవమంటే ఏమిటో చూచుకో
వీటికి ప్రతిరూపము నిరూపించు దైవము
మనకోసము మరణించిన మన తండ్రి కుమారుడు

Your favourites

  • No Favourites found!