Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా Telugu Christian Song Lyrics

యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా Lyrics


యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2)          ||యేసయ్యా||

నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2)          ||యేసయ్యా||

నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)          ||యేసయ్యా||

నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2)          ||యేసయ్యా||

ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

Your favourites

  • No Favourites found!