Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా Telugu Christian Song Lyrics

యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా Lyrics


యేసయ్య మాట విలువైన మాట
వినిపించుకోవా సోదరా
వినిపించుకోవా సోదరీ (2)
నీ గుండెలోన ముద్రించుకోవా
ఏ నాటికైనా గమనించలేవా
గమనించుము పాటించుము ప్రచురించుము
నిన్నూవలె నీ పొరుగువారిని
ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య||
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట
నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట
కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2)
సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2)
దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య||
నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని
అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని
కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2)
అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2)
నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||

Your favourites

  • No Favourites found!