Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్యా నా దొరా నీ సాటి Telugu Christian Song Lyrics

యేసయ్యా నా దొరా నీ సాటి Lyrics


యేసయ్యా నా దొరా
నీ సాటి ఎవరయ్యా ఈ ధర
నా కోసమే వచ్చిన సర్వేశ్వరా
నను విడిపించిన కరుణాకరా
మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా
వేసారిపోనయ్యా ధవళాంబరా (2)        ||యేసయ్యా||

మండే నా బ్రతుకే పాటగా
నిండైన నీ బ్రతుకే బాటగా (2)
పండంటి నీ ప్రేమ తోటలో
మెండైన నీ వాక్యపు ఊటలో
దొరికింది నా వరాల మూట
సప్త స్వరాలే చాలవింక నా నోట (2)        ||యేసయ్యా||

నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా
వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)
మిగిలిన శ్రమలను సంతర్పణలో
కదిలే కన్నీటి అర్చనలో
పండింది నా నోముల పంట
ఎంత పంచినా తరగదు ఈ దేటంట (2)        ||యేసయ్యా||

నా దాగు చోటు నీవేనయ్యా
చికాకు పడక నన్ను కాచేవయ్యా (2)
ఏకాకి నేనింక కాబోనయ్యా
నీ రాక కోసమే ఉన్నానయ్యా
శ్రీమంతుడా సాత్వికుడా
పరిపూర్ణుడా కడు దీనుడా (2)        ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!