Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్య నా Telugu Christian Song Lyrics

యేసయ్య నా Lyrics

యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే
ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను
నే అలయక నడిపించెను
నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాద్యుడా

1. చిరకాలము నాతో ఉంటానని
క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని
తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా – (2)
ఏదైనా నాకున్న సంతోషము
నీతోనే కలిగున్న అనుబంధమే  (2)
సృజనాత్మకమైన నీకృప చాలు
నే బ్రతికున్నది నీకోసమే  (2)    ||యేసయ్య||
                               
2. జీవజలముగా నిలిచావని
జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగామార్చావని
జగతిలో సాక్షిగాఉంచావని
ఉత్సాహగానము నే పాడనా – (2)
ఏదైనా నీకొరకు చేసేందుకు
ఇచ్చితివి బలమైన నీశక్తిని  (2)
ఇదియేచాలును నా జీవితాంతము
ఇల నాకన్నియు నీవేకదా  (2)   ||యేసయ్య||
                              
3. మధురముకాదా నీనామధ్యానం
మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం
క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నేపాడనా – (2)
నిజమైన అనురాగం చూపావయ్యా
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా  (2)
స్తుతుల సింహాసనం నీకొరకేగా
ఆసీనుడవై ననుపాలించవా  (2)   ||యేసయ్య||

స్తుతిపాత్రుడా – స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్య

Your favourites

  • No Favourites found!