యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు
పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య||
1. పాపాలను క్షమియించే
శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే
శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
2. రోగికి స్వస్థతనిచ్చే
శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే
శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
3. దురాత్మలను పారద్రోలే
శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే
శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
4. సృష్టిని శాసించగలిగిన
శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన
శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
5. పాతాళాన్ని తప్పించే
శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే
శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||