Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా నీ Telugu Christian Song Lyrics

యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా నీ Lyrics


యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !!

1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే - నీ వాక్యములో
నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !!

2. నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను !! యేసయ్య !!

3. నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును !! యేసయ్య !!

Your favourites

  • No Favourites found!