Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని Telugu Christian Song Lyrics

యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని Lyrics


యేసయ్యా నిన్ను ప్రేమించువారు
బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)
శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారు
సకలమైన ఉపద్రవముల నుండి (2)
నిర్దోషులై కాపాడబడెదరు
అపవాది అగ్ని బాణముల నుండి (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారు
దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)
సమకూడి జరుగును సమస్తము
సదా మాతో ఉన్నందున (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారిని
ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)
మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
తప్పించి బలపరచినావు (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారి
చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)
వారి కాలమంతట దేశమంతయు
నెమ్మదిగా నుండును (2)       ||యేసయ్య||

Your favourites

  • No Favourites found!