Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను Telugu Christian Song Lyrics

యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను Lyrics

యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని
యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం
ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో
ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం
యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో
హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగినియున్నది నా హృదయం

Your favourites

  • No Favourites found!