Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్యా సదాకాలము – నీ యందే Telugu Christian Song Lyrics

యేసయ్యా సదాకాలము – నీ యందే Lyrics


(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి

నిలుపుచున్నాను (2)

అక్షయ కిరీటం పొందాలని

అనుక్షణం నే స్తుతియింతును (2)

ఆరాధనా ఆరాధనా

యేసయ్యా నీకే నా ఆరాధనా (2)    ||సదాకాలము||చుక్కాని లేని నావనై

సంద్రాన నే చిక్కుబడగా (2)

నా దరి చేరి – ఈ ధరలోన

నీ దరి నడిపించావే (2)    ||ఆరాధనా||

అన్య జనులు ఏకమై

నిందలు నాపైన మోపినా (2)

నిందలు బాపి – నన్నాదుకొని

విడువని కృప చూపినావే (2)    ||ఆరాధనా||

నాశనకరమైన ఊభిలో

నేను పది కృంగగా (2)

హస్తము చాచి – నను ఆదుకొని

(నీ) ఆత్మతో బలపరచినావే (2)    ||ఆరాధనా||

Your favourites

  • No Favourites found!