యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే… నా దుర్గము నీవే
నా కాపరి నీవే ||2||
శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ ||2||
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును ||2|| ||యేసే నా||
జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా ||2||
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును ||2|| ||యేసే నా||
దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ ||2||
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును ||2|| ||యేసే నా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసే నా ఆశ్రయము యేసే నా Lyrics
Your favourites
- No Favourites found!
