యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు
నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె
1. నే దూరమైతి నీకు - నశియొంచితి లోకమున
నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను
2. నే తలచలే దెప్పుడు - నా అంత మేమవునని
నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని
3. నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను
నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి
4. రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగి
రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి
5. పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి
పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు Lyrics
Your favourites
- No Favourites found!
