యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు (2)
విలువైనదీ నీ బంధము
అతీయిత మైనది అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు
“నీవే నా ప్రాణం – నీవే నా జీవం
నీవే నా గమ్యం – నీవే…. ఆధారం ” (2)
1. చెప్పలేని బాధలలో
మదనపడే వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున
చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు (2)
చీకటి క్షణాలలో – చిరు వెలుగువై
నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా
|| నీవే నా ప్రాణం ||
2. హృదయమంత వేదనతో
కలవరమే చెందగా
ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన – పరిస్థితులే చేజారిన
చేయూతనే అందించావు (2)
అలసిన ప్రతి క్షణం ఆదరణవై
నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని
నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా
|| నీవే నా ప్రాణం ||
3. నా అన్నవారే నిందలు మోపగా
స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే అవమానించగా
న్యాయాధిపతివై ఘనత నీచ్చావు (2)
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ
మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై
పితరుల అభిషేకం ఇచ్చావయ్యా
|| నీవే నా ప్రాణం ||
