Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము Telugu Christian Song Lyrics

యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము Lyrics

యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము దోసకారి జనుల
కెంతోఁ గ్రాసమవునా యేసు పేరు ||యేసు||

1. తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద నెల్లకాలమందు నుంచు
యేసుఁడే మా తండ్రియౌను ||యేసు||

2. వల్లగాని వశములేని యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి
దేవ కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు||

3. దండియైన గండములు మెండుగాను మముఁజుట్టిన తండ్రివలె మా
దరికి వచ్చి గండములను గదిమిఁ బ్రోచున్ ||యేసు||

4. సత్యము మార్గముతానె నిత్యజీవమింకా తానే భ్రుత్యుల మనకీయ
మోక్షము భువిని రక్తమంత గార్చె ||యేసు||

5. ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము
భువిని బలిపెట్టినాఁడు ||యేసు||

6. ఒడలు నిండా గాయములతో నడరు చుండమరల లేచి వెడలి
పరమందునుండి వేడుకలు మాకంపినాఁడు ||యేసు||

7. ఆశతోడఁ తన్ను నమ్ము యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు
సాటి లేశమైనా లేరుసుండీ ||యేసు||

Your favourites

  • No Favourites found!