Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి Telugu Christian Song Lyrics

యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి Lyrics

యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము లోపల
వాసిగాఁ ప్రభు యేసు దాసులె పరమునందు ని వాసులగుదురు ||యేసు||

1. యేసు క్రీస్తును నమ్మి యాయన దాసుఁడై వర్తించు నాతఁడె భాసు
రంబుగఁ గ్రైస్తవుం డని ప్రాకటంబుగఁ బరగుచుండును ||యేసు||

2. ఎల్ల సమయములందు ధాత్రిని యేసు నడతలఁ జూచి నడఁచుచు
నుల్లమున రక్షకునిఁ దాల్చిన యోర్పరియె క్రైస్తవుఁడు సుమ్ము ||యేసు||

3. క్రీస్తు నన్ను గొనెను గావున క్రీస్తువాఁడను నేన టంచును క్రైస్తవుండు
గొల్చు నాతని వాస్తవమ్ముగ నాత్మ తనువుల ||యేసు||

4. రాజులు యాజకులు శుద్ధులు రాజనందను లనెడు పేళ్ళను రాజ
రాజగు దేవుఁ డొసఁగెను రాజితంబుఁ క్రైస్తవులకును ||యేసు||

5. క్షయము లేనిది శుద్ధమైనది వ్యయము లేనిది నిత్యమైనది దయను
యేసుఁ డొసంగు భాగ్యముఁ దప్పకుండఁ క్రైస్తవులకును ||యేసు||

Your favourites

  • No Favourites found!