యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు
లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు ||యేసు||
1. పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప
వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు ||యేసు||
2. సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు
నీ కృప చాల యిలలోఁ దెల్పితివే ||యేసు||
3. అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు
మూఁడవ దినమున బ్రతికియు లేచితివే ||యేసు||
4. పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు
ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా ||యేసు||
5. దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము
మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు ||యేసు||
6. నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద
ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను ||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ Lyrics
Your favourites
- No Favourites found!
