యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి మనుజులారా మోస
మొందక మోక్షపతికిఁక దాసులై బ్రతుకండి రండి ||యేసు||
1. ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగఁ
జేసి నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు ||యేసు||
2. ఆది పురుషుని యాదిస్త్రీనిఁక హస్తములతో నంటి చేసెను మేదినిన్
ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను ||యేసు||
3. వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము
వారి పరమై పాపులైరి ||యేసు||
4. వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని
యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు ||యేసు||
5. ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగాఁ బ్రేమించెనో
తన సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను ||యేసు||
6. పాపమించుకలేని కరుణా పావనుడు నరుఁడాయెను శాపగ్రస్తులమైన
మన శాపములు తాఁజేతఁ బూనెను ||యేసు||
7. ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నఁడు నీలాటి
ప్రేమ వన్నెలేదో యన్నలారా ||యేసు||
8. మనలఁ బాపమునుండి బాపను మనుజుఁడై మరణంబునొంది మన
ప్రభువె మూఁడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను ||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి Lyrics
Your favourites
- No Favourites found!
