Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు Telugu Christian Song Lyrics

యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు Lyrics

యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు నే నీ సుమార్గముఁ బట్టితి నా
స్వజనము లనాదరంబునఁ త్రోసినను పగజేసిన నా సమస్తము నీవెగా
యిక నే సరకుగొన నేమియున్ ||యేసు||

1. ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ లన్ని భిన్నము నొందిన నన్ను
ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక
నన్నుఁ గదుపున దెవ్వరు ||యేసు||

2. ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ
కుండవు పతితుఁడై నీ దాపు జేరిన వానికిన్ దాప మాపుచు సంతసంబిడి
ధన్యుఁ జేయుదు వీవెగా ||యేసు||

3. నినుఁ బ్రేమించెడు తండ్రిని నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును
గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము
రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్ ||యేసు||

4. విశ్వాస కవచంబును మేను నిడి విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు
రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు నడుపు విశ్వసితము లభించునట
నీ విన్నపము స్తుతి యౌనుగా ||యేసు||

Your favourites

  • No Favourites found!