Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నామం అన్నిటికన్నశ్రేష్ఠమైన నామంయేసు స్మరణే Telugu Christian Song Lyrics

యేసు నామం అన్నిటికన్నశ్రేష్ఠమైన నామంయేసు స్మరణే Lyrics

యేసు నామం అన్నిటికన్న
శ్రేష్ఠమైన నామం
యేసు స్మరణే ఎప్పటికైనా
అభయము ఆధారమే
పాడుదాం చాటుదాం
యేసు జన్మ వార్తను
చూపుదాం నిలుపుదాం ॥2॥
ప్రభు ప్రేమ సువార్తను ॥యేసునామం॥
1॰
దేవుడే మనిషిగ పుట్టెను
దాసునిగా వచ్చెను ఇదియే ఆశ్చర్యము
ప్రభువే మన పాపము కొరకై ॥2॥
భువికరుదెంచెను
చూడు ఎంత ప్రేమయో
కృపగల దేవుడు యేసయ్యా
దయగల దేవుడు మెస్సయ్యా ॥2॥
॥పాడుదాం॥ ॥యేసు నామం॥
2॰
గొల్లలు జ్ఞానులు చూచిరి
స్తుతులర్పించిరి సాక్షులుగా నిలిచిరీ
యేసునీ ప్రేమను తెల్పుదాం ॥2॥
లోకాన చాటుదాం
సాక్షులుగా బ్రతుకుదాం
ఇదేగా క్రిస్ట్మస్ ఆనందం
ఇదేగా క్రిస్ట్మస్ సంతోషం ॥2॥
॥ఆడుదాం॥ ॥యేసు నామం॥

Your favourites

  • No Favourites found!