యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు దాసులతో ఁ బొత్తుఁ గూడు దమ
||యేసు||
1. ఇహసంబంధుల పొందుఁ జాలింతమ మహా మహుఁడౌ దేవుని యాజ్ఞఁ
బాలింతమ ||యేసు||
2. శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ
||యేసు||
3. దోషములను బైటఁ బెట్టుదము కపట వేషభాషలఁ గ్రుంగఁ బట్టు దమ
||యేసు||
4. మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ
||యేసు||
5. జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ
||యేసు||
6. మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరుఁ
బెరుకుదమ ||యేసు||
7. పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు
దమ ||యేసు||
8. సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట
ల్విడిచెదమ ||యేసు||
9. దినము ప్రార్థనఁ జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై
నెదిరింతమ ||యేసు||
10. గురు బోధ స్థలికి బిరబిరఁ బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు
గుదమ ||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు Lyrics
Your favourites
- No Favourites found!
