Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నామ మెంతో మధురం యేసు Telugu Christian Song Lyrics

యేసు నామ మెంతో మధురం యేసు Lyrics

యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం
దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు||

1. స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ
ద్రుంచు ప్రభు ||యేసు||

2. నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు
ప్రభు ||యేసు||

3. ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు
ప్రభు ||యేసు||

4. మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ
ప్రభు ||యేసు||

5. శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు
ప్రభు ||యేసు||

Your favourites

  • No Favourites found!