Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నామమే పావనము మాకు యేసు Telugu Christian Song Lyrics

యేసు నామమే పావనము మాకు యేసు Lyrics

యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస
జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు||

1. సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ
గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు.
||యేసు||

2. భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త
రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు||

3. దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము
పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల
||యేసు||

4. పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప
సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు||

Your favourites

  • No Favourites found!