Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక Telugu Christian Song Lyrics

యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక Lyrics

యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక లేదుగా దోసముల
నెడబాపి పరమని వాస పదవికిఁ జేర్చుఁగా ||యేసు||

1. నిత్య రక్షణ నిత్య జీవము నిజముగా మాకిచ్చును సత్యసువిశేషార్థసారము
సతము గ్రోలుట కొసఁగెను ||యేసు||

2. దురిత భవ మను నంధకారము దూరముగఁ బోఁదోలెఁగా అరయఁ
దన విమలాత్మ వరమున మరల మము వెలిఁగించెఁగా ||యేసు||

3. గొప్ప కుల గర్వముల మెప్పను తప్పుల న్విడఁగొట్టెను చెప్ప శక్యముగాని
రక్షణ సృష్టిలో మము నిల్పెను ||యేసు||

4. అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను దొడ్డ కాపరి యేసు
తన దగు దొడ్డిలో మముఁ జేర్చెను. ||యేసు||

Your favourites

  • No Favourites found!