Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నాథ కథా సుధా రస Telugu Christian Song Lyrics

యేసు నాథ కథా సుధా రస Lyrics

యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి
జనంబులారా దురిత భవముల బాయరే ||యేసు||

1. ఇహపరంబు లెవనిచే సృజి యింపఁబడియెనొ చూడరే అసహహ యా
విభుఁ డవతరించెను అతని గుణములఁ బాడరే ||యేసు||

2. దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది
నమ్మి యా ప్రభు కరుణ మదిఁ గొనియాడరే ||యేసు||

3. పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ
కొఱ కిచ్చు క్రీస్తుని దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు||

4. మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతోఁ
బాపులఁ బిలుచు గురు దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు||

5. పరమతత్వ విధాన బోధలు బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద
పదముఁ గోరిన జీవులకు వినిపించెను ||యేసు||

6. మరణ మొందిన కొందఱికిఁ దా మరలఁ బ్రాణము లిచ్చెను వర
మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను ||యేసు||

7. కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను
నెమ్మదిని మీరొం దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు||

Your favourites

  • No Favourites found!