Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ Telugu Christian Song Lyrics

యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ Lyrics

యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా
మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా ||యేసు||

1.
రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి
దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా ||యేసు||

2.
హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును
సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|

3.
కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ
పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో ||యేసు||

4.
మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు
మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||

5.
చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల
నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా ||యేసు||

Your favourites

  • No Favourites found!