Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నీ నామామృతము మా కెంతో Telugu Christian Song Lyrics

యేసు నీ నామామృతము మా కెంతో Lyrics

యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా దేవ మా
దోసములను హరించి మోక్షని వాసులుగఁ జేయుటకు భాసుర ప్రకాశమైన
||యేసు||

1. వేడు కలరఁగఁ గూడి నినుఁ గొని యాడు వారికి దేవ యెంతో
కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని తాడనము జేసితివి
||యేసు||

2. పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ నీ దాపుఁ జేరిన
వారి కందరి కాపదలు బాపి నిత్య | కాపుగతిఁ జూపినావు ||యేసు||

3. అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవ మమ్ముఁ పక్షముగ
రక్షించి మోక్షసు రక్షణకు దీక్షఁ గొని వీక్షితులమైన మాకు ||యేసు||

4. అందమగు నీ మందిరమున బొందుగా మేము దేవ నీ సుందర
కరుణామృతము మా డెందముల యందు గ్రోలు టందుకు సుందరమైన
||యేసు||

Your favourites

  • No Favourites found!