Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నీ స్వరూపమును నేను చూచుచు Telugu Christian Song Lyrics

యేసు నీ స్వరూపమును నేను చూచుచు Lyrics

యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
నీ పోలికగా నేను మారెదన్ (2)
1. యేసు నా కొరకు నీవు, పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి, దీనుడైతివి
నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము
2. ప్రేమ గల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారానే, సమస్తము నిచ్చితివి
ఈ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
నీ ప్రేమతో నింపుము
3. ప్రభువా నీవందరి యెడల, శాంతము వహించితివి
ఎవరును నశింపక యుండవలెనని
నేను సహించలేను, సహనమునే కోల్పోయాను
నీ శాంతముతో నింపుము
4. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము
నీ సత్యము మేఘముల నంటుచున్నది
నే నయోగ్యదాసుడను, నిన్ను దుఃఖపెట్టి యున్నాను
నీ యధార్థతో నింపుము
5. యేసుని స్వరూపము కల్గి ఆయనవలె మారెదన్
ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్
ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము


Your favourites

  • No Favourites found!