Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నీకే జయం జయము నీవె Telugu Christian Song Lyrics

యేసు నీకే జయం జయము నీవె Lyrics

యేసు నీకే జయం జయము (2)
నీవె లోక పాల - కుడవు (2)
సర్వ సృష్టికి సృష్టి - కర్తవు
సర్వలోక రక్ష - కుడవు
జై జై అనుచు నీ - కే పాడెదం (2)
1. జన్మించె జగమున మా - నవ రూపములో
ప్రాయశ్చిత్తము - కై - తా - నె బలియాయె
పాపియైన మా - న - వుని రక్షింప
శిలువ నెక్కి తన ప్రా-ణము నిచ్చెన్
హల్లెలూయా భువిపైన (2)
2. మరణము ద్వారా - అంతమాయె బలులు
-త-న స-మా-ధి, సర్వం కప్పెన్
తిరిగి లే-చుటచే, సర్వం నూతనమాయె
సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి
హల్లెలూయా భువిపైన (2)
3. స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్
తండ్రి కుడిప్రక్కన, ఆ-యన కూర్చుండెన్
రాజుల రాజై, ప్రభువుల ప్రభువై
పొందె అధికారము - పరలోకముపై
హల్లెలూయా భువిపైన (2)
4. తన రూపమునకు మార్పు, నిష్ట-మాయె
సృష్టికంటె ముందు తానె సంకల్పించె
లోక దుఃఖము నుండి - మనం తప్పించుకొని
తన రూపము నొంది - తనతో-నుండెదం
హల్లెలూయా భువిపైన (2)


Your favourites

  • No Favourites found!