Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు నీదు Telugu Christian Song Lyrics

యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు నీదు Lyrics

యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు - నీదు ప్రేమను నేను పొందుచున్నాను
దిన దినము నాయెడల - నీ కృప విస్తరించు చున్నది - 2
నీ కృప విస్తరించు చున్నది.
1. ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు
నా చేయిపట్టి నడిపేవారు ఈలోకమందు కానరారే -2
అయితే తల్లిగా, తండ్రిగా నీవే వున్నావు
నీదు ప్రేమతో నా చేయిపట్టి నడుపుచున్నావు - 2 "దినదినము"
2. నా యోగ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు
ఆధరణా చూపేవారు అయిన వారుకానరారే - 2
అయితే స్నేహమై, బంధమై నీవే వున్నావు
అన్నివేళలా ఆధరణ చూపుచున్నావు - 2 " దినదినము"
3. కష్టాలు తీర్చేవారు ఒక్కరైనా కానరారే
ఓదార్పునిచ్చేవారు ఎవరు నాకు లేనేలేరే - 2
అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే వున్నావు
నిత్యము నీ సన్నిధిలో బలపరుచుచున్నావు - 2 "దినదినము"

Your favourites

  • No Favourites found!