Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము Telugu Christian Song Lyrics

యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము Lyrics

యేసు నిన్ను పిలచెను - వాసిగా స్వరము విను
1. కార్చె రక్తము కల్వరిలో - కఠిన బాధలెల్ల నోర్చి
చూపె ప్రేమ నుర్వికొఱకు
జాపె బాహువుల్ కరుణతోడ - సేద దీయును
2. క్రీస్తు ప్రేమ తెలిసికొనుము - రయము తోడ మనసు నిల్పి
దాని పొడవు వెడల్పు లోతు
నెత్తు గ్రహించు తెలివి తోడ - చెంత చేరుము
3. ప్రీతి తోడ యేసు ప్రభువు - ప్రాణము నర్పించె నీకై
దీని వలన ప్రేమ యెట్టిదో
తెలిసికొనుము బుద్ధితోడ - పాప మొప్పుకో
4. బల్లెముతో పోటుపొడువ - బాధ సహించె ప్రేమ తోడ
సమాప్తమని తలను వంచె
సర్వలోక సృష్టికర్త - చాటు జేరుము
5. లోకమంత జయించుకొన్న - లోభివలె నశించెదవుగా
స్వంత ప్రాణమును కాపాడు
స్వరక్షకుని చెంత జేరి - సేద దీర్చుకో


Your favourites

  • No Favourites found!