Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు ప్రభూ గద్దెపైనున్న నీకుమా స్తుతులను Telugu Christian Song Lyrics

యేసు ప్రభూ గద్దెపైనున్న నీకుమా స్తుతులను Lyrics

1. యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు
మా స్తుతులను చెల్లించెదము
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండ వీవంచు కీర్తింతుము
పాత్రుండవీవే పాత్రుండవీవే
పాత్రుండవీవే మాప్రభు నీవే
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండవీవంచు కీర్తింతుము
2. దేవుడౌ నీవు నరరూపమెత్తి
దూతలకన్న తగ్గింపబడి
స్త్రీ సంతానమౌ నీవు మరణించి
సర్పము తల నణగ ద్రొక్కితివి
3. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను
నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి
దైవ మానవులచే వీడబడి
శాప నష్ట మనుభవించితివి
4. మహిమతో మరణమును గెల్చి
గొప్ప విజయము పొందితివి
చావు సమాధులపై విజయుండా
నిన్ను స్తుతింపక నెట్టులుందును

Your favourites

  • No Favourites found!