Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును Telugu Christian Song Lyrics

యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును Lyrics

యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును
ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు
1. మృతియే పాపపు జేవము - ప్రభుని వరము జీవము
క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును
ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడినిన్ కొనెగదా
మరతువా యేసుని ప్రేమను - మరువకు
2. కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నో
గ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను
3. మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్
మరణ భయములో నున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో
4. సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని
మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే
5. దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు
పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము
6. దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును పొందను
7. పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్
ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేభూని
దేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
నీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ


Your favourites

  • No Favourites found!